prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 8:17 am Digital Edition : PRAJA VANI

ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకావిష్కరణ చేసిన డిఐపిఆర్ఓ ఏ.బాలకొండయ్య

అనంతపురం బ్యూరో ఆగస్టు 15 ప్రజా వాణి
అనంతపురం నగరంలోని ఆదిమూర్తినగర్ లో ఉన్న ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ ఏ.బాలకొండయ్య జాతీయ పతాకావిష్కరణ చేసి.. జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం కార్యాలయం అధికారులు, సిబ్బందితో గ్రూప్ ఫోటో దిగారు.ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ ప్రభాకర్, పిఆర్ఓ వి.సూర్యనారాయణ రెడ్డి, ఏపిఆర్ఓ ఫక్రుద్దీన్, సీనియర్ అసిస్టెంట్ ప్రభావతి, కార్యాలయం సిబ్బంది చాంద్ భాష, సుహాసిని, కోటి, తాజుద్దీన్, భాస్కర్, కాసీం, నజీర్, రాజారావు, అమ్మన్ని, శైలజ, గంగ పాల్గొన్నారు.