prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 7:27 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

ఏబీవీపి ఆద్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

ఏబీవీపి ఆద్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

 

ఆఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ఏబీవీపీ) తొర్రూరు శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ఈరోజు తొర్రూరు పట్టణంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులకు రాఖీలు అందించి నువ్వు నాకు రక్షా -నేను నీకు రక్షా -మనమంతా దేశానికి , ధర్మానికి రక్షా అనే మంత్రాన్ని జపిస్తూ రాఖీలు కట్టించడం జరిగింది.ఈసందర్బంగా ఏబీవీపి తొర్రూరు మండల కన్వీనర్ చిలుక మనోజ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి లో రక్షాబంధన్ కు పవిత్ర మైన స్థానం ఉంది అని తెలిపారు.వేద కాలం నుంచి రక్షా భందన్ పర్వదినం సందర్భంగా సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి రక్షణ కోరడం ఆనవాయితీగా వస్తోంది అని తెలిపారు.విదేశీ విష సంస్కృతి కి అలవాటు పడి నేడు కొంతమంది స్వదేశీ సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోయి విచ్చలవిడి జీవితాల్ని గడుపుతూ తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమం లో హర్ష, రాంచరణ్, మణి,బంతి,మానస,స్వప్న, శిరీష, మేఘన తదితరులు పాల్గొన్నారు.