prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 6:28 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఏడో వార్డ్ లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చందూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఏడో వార్డ్ లో మునుగోడు అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చందూర్ మున్సిపాలిటీకి కేటాయించిన 15 కోట్ల అభివృద్ధి నిధుల నుండి శనివారం 7వ వార్డు నందు డ్రైనేజీ, సిసి రోడ్ల పనులను చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు కోరారు. ఈ సందర్భంగా ఏడవ వార్డు కౌన్సిలర్ కోడి సుష్మా వెంకన్న మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి సహకారంతో చందూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని వార్డులో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేస్తూ వార్డుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు వాసు, జెల్లా ధనమ్మ శ్రీనివాసులు, కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, షరీఫ్, మొగుడాల వెంకన్న, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, పున్న సైదులు , చెనగాని కిరణ్, బొమ్మగాని కిరణ్, జగన్, విజయ, ఉన్నారు.