prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 3:21 pm Digital Edition : MAHESH MEDCHAL

ఏడు సన్నరకాల వరి పండించిన రైతులకే రూ.500 బోనస్

ఏడు సన్నరకాల వరి పండించిన రైతులకే రూ.500 బోనస్ మండల వ్యవసాయ అధికారి మాధవరెడ్డి

మెడ్చల్, ఆగస్టు 19: ప్రభుత్వం సూచించిన ఏడు సన్నరకాల వరి పంటలను పండించిన రైతులకు మాత్రమే క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ వర్తిస్తుందని మెడ్చల్ మండల వ్యవసాయ అధికారి ఎస్.మాధవ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన సన్నరకాల్లో BPT-5204, HMT సోనా, జై శ్రీరామ్, కెనేం -1638, KNM-7715, RNR-15048, WGL-44 రకాలు ఉన్నాయని పేర్కొన్నారు. విత్తన డీలర్లు, షాపుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన అదే డీలర్ షాపులో తప్పనిసరిగా ఆన్‌లైన్ నమోదు చేయించుకోవాలని సూచించారు. సీడ్ ప్లాంట్లు, యూనివర్సిటీలు, వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సంబంధిత జెరాక్స్ పత్రాలను సమర్పించాలని తెలిపారు. అదేవిధంగా సొంత విత్తనాలను వినియోగించుకుంటున్న రైతులు స్వయంగా దరఖాస్తు ఫారాన్ని నింపి తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారికు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వం అందించే రూ.500 బోనస్ పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మాధవ రెడ్డి స్పష్టం చేశారు.