prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 9:20 am Digital Edition : PRAJA VANI

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గరిడేపల్లి మండల కేంద్రం లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు<br>

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గరిడేపల్లి మండల కేంద్రం లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

   గరిడేపల్లి ఆగస్టు 15 (ప్రజావాణి)

ఏంధరో త్యాగ ధనుల పోరాట ఫలితమే స్వాతంత్ర దినోత్సవం అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నాడు భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గణంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు

ఈ సందర్బంగా జాతీయ పతకాన్ని ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బెజ్జం రమేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ,దేశ స్వాతంత్య్ర.కోసం ఎందరో త్యాగధనులుపోరాటం చేశారని,వారి వారి త్యాగాల పలమే నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలని ఆయన అన్నారు.

స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలనే భారత రాజ్యాంగాన్ని నిర్మించుకొన్నామని, స్వేచ్ఛ, సమానత్వం ,సౌబ్రాతృత్వం అందరికీ అందాలని ఆయన అన్నారు.

దేశంలో అపారమైన ఖనిజ సంపద ఉందని దానిని వెలికి తీసి, దేశాభివృద్ధికి పాటుపడాలని అంతరాలు లేని సమాజం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న  చట్టాలను రద్దు చేసి కార్మికుల హక్కులను హరిస్తోందని, ఇది సరైన విధానం కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా అందరి హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం పై వున్నదని ఆయన అన్నారు.
స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కింది స్థాయి  వరకు స్వేచ్ఛ పలా లు, అందరికీ అందటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో  భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బెజ్జం రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి యడవల్లి వెంకటేశ్వర్లు, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, mrps మండల అధ్యక్షులు కొత్తపల్లి రవి, నకిరేకంటి రవి, సతీష్,పిట్టా సైదులు, మైసయ్య, శేఖర్, బిక్షం, ఏసు,మీరా,పాషా,కార్మికులు.పెద్ద ఎత్తున పాల్గొనారు.
.