prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:33 am Digital Edition : SRIKANTH MULUGU

ఎస్.హెచ్.జి మహిళలపై జోక్యం ఎందుకు??

ఎస్.హెచ్.జి మహిళలపై జోక్యం ఎందుకు??
.ఎమ్మెల్యే, జెడ్పీటీసీ గారు ఇప్పటి వరకు ఏం చేశారు?
గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తున్న మహిళలపై రాజకీయ జోక్యం
వెంకటాపూర్ లో ప్రజా ప్రతినిధుల మౌనం ఎందుకు
వి.ఓ మీటింగ్ లో కూడా హద్దులు దాటిన ఉపసర్పంచ్
ఎం.పి.డి.ఓ, ఐ.కె.పి అధికారులకు కనిపించలేదా?
ఎస్.హెచ్.జి సంఘాల్లో రాజకీయాలు వద్దు
లక్ష్మీదేవి పేట మహిళలకు న్యాయం చేయండి – ప్రజల డిమాండ్
అసలు సర్పంచ్ ఉన్నారా.?
సెర్ప్/మెప్మా ని కూడా పట్టి పట్టి అడుగుతున్నారా?
వెంకటాపూర్ లో ఉపసర్పంచ్ వ్యవహారం – అధికారులు స్పందించాలి

ములుగు జిల్లా ప్రతినిధి(ప్రజావాణి)
ములుగు జిల్లా
వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామంలో ఎస్.హెచ్.జి సంఘాల వ్యవహారాల్లో స్థానిక ఉపసర్పంచ్ అనవసర జోక్యం చేసుకుంటున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.
స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలు, నిర్వహణలో ఉపసర్పంచ్ తిరుపతి అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సెర్ప్, మెప్మా నిబంధనల ప్రకారం జరిగే రుణాల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
మంగళవారం జరిగిన వి.ఓ సమావేశంలో కమ్యూనిటీ యానిమేటర్ పై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా హద్దులు దాటి మాట్లాడారని విమర్శించారు.
గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతూ కష్టపడి పనిచేస్తున్న మహిళలపై రాజకీయ జోక్యం సరికాదని మహిళా సంఘాల ప్రతినిధులు తెలిపారు.
ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎం.పి.పి ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం పై మహిళలు నిరాశ వ్యక్తం చేశారు.
ఎం.పి.డి.ఓ, ఐ.కె.పి అధికారులు వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు స్పందించని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మహిళలు ప్రకటించారు.
ఎస్.హెచ్.జి సంఘాలను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని కోరారు.
మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని గుర్తు చేశారు.
ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడానికి అడ్డుపడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు.