ఎస్టీపీపీ నుంచి ముగ్గురు ఉత్తమ ఉద్యోగుల ఎంపిక

జైపూర్, ఆగస్టు 14,ప్రజావాణి: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP) నుంచి ముగ్గురు ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసినట్లు పవర్ ప్లాంట్ కమ్యూనికేషన్ సెల్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇందులో భాగంగా సీనియర్ అసిస్టెంట్ మెరుగు రాజ్ కుమార్‌ను 'ఉత్తమ సింగరేణియన్' గా ఎంపిక చేశారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరగబోయే సెంట్రల్ ఫంక్షన్‌లో సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (C&MD) డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి చేతుల మీదుగా ఆయన సన్మానం అందుకోనున్నారు.అలాగే ఎస్టీపీపీ...