ఎస్టిపిపిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జైపూర్ , ఆగస్టు 15, ప్రజావాణి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో (ఎస్టిపిపి) శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్టిపిపి కార్యనిర్వాహక సంచాలకులు (ఈడి) సిహెచ్. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఈడి చిరంజీవి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం, రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. 79 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను...