prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 8:32 pm Digital Edition : NARESH Nayak RAMAYAMPET

ఎస్‌ఐఆర్‌ రెండో దశపై బీజేపీ కార్యశాల సమావేశం

ఎస్‌ఐఆర్‌ రెండో దశపై బీజేపీ కార్యశాల సమావేశం
నర్సాపూర్‌, ఆగస్టు 22: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ రెండో దశకు సంబంధించిన కార్యశాల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత, ఎస్‌ఐఆర్‌ మెదక్ జిల్లా ఇన్‌చార్జి సతీష్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు రెండో దశలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఓటర్ల జాబితా పరిశీలన, క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన బాధ్యతలు, సమన్వయంతో పనిచేయాల్సిన విధానంపై విస్తృతంగా చర్చించారు. బూత్ స్థాయి ఏజెంట్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్‌ఐఆర్‌ రెండో దశకు సంబంధించిన ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని నాయకులు సూచించారు.
మొదటి దశలో బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని నాయకులు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రెండో దశలోనూ మరింత పట్టుదలతో పనిచేసి పార్టీకి మంచి ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని పార్టీ నాయకత్వానికి చేరవేయాలని సూచించారు.
ఎస్‌ఐఆర్‌ రెండో దశలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని, బూత్ స్థాయి ఏజెంట్లు తమ పరిధిలోని ఓటర్లతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించాలని నాయకులు తెలిపారు. పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే రెండో దశలోనూ మెదక్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసని సురేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, మాజీ ఓబీసీ మోర్చా నాయకులు రమేష్ గౌడ్, రాష్ట్ర, జిల్లా కార్యదర్శి అశోక్, సాదుల బిక్షపతి, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, యువజన మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు గుండం శంకర్, సుభాష్ గౌడ్, మండల అధ్యక్షులు నాగ ప్రభు గౌడ్, పెద్దపులి రవి, హరీష్, నాగేందర్ రెడ్డి, బూత్ స్థాయి ఏజెంట్లు, మండల నాయకులు, సర్పంచులు నాగభూషణం, మల్లేశం, కుమార్, ఉపసర్పంచ్ నరేష్, యువజన మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.