ఎరువుల ధరలు తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి -సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్
బెజ్జంకి, ఆగస్టు 11 (ప్రజావాణి) ఎరువుల ధరలను వెంటనే తగ్గించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎరువుల ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను విపరీతంగా పెంచుతూ రైతులను నిండా ముంచుతోందని విమర్శించారు. ఎరువుల ధరలు పెంచుతున్న ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధర...