prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:20 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఎండపల్లి మండల ప్రజావాణి వేదిక మార్పు: నేటి నుంచి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహణ

ఎండపల్లి మండల ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే ‘ప్రజావాణి’ వేదికను మార్చినట్లు ఎంపీడీవో దొండ కృపాకర్ తెలిపారు. గుల్లకోట రైతు వేదికకు బదులుగా ఇకపై ఎండపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని. వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ వేదిక మార్పును గమనించి, వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.