ఎండపల్లి ప్రెస్ క్లబ్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం: పాల్గొన్న ఎస్సై ఉదయ్ కుమార్

ఎండపల్లి మండల TUWJ (IJU) ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నల్లాల కుమార్  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి వెల్గటూర్ మండల ఎస్సై ఉదయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కుమార్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పాత్రికేయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో TUWJ (IJU) యూనియన్ పాత్రికేయులు, స్థానిక నాయకులు  తదితరులు పాల్గొన్నారు.