prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 4:15 pm Digital Edition : RRAJUREGONDA REGONDA

ఉమ్మడి రేగొండ మండల జర్నలిస్టుల అధ్యక్షులుగా పట్టెం కోటిలింగం ఏకగ్రీవం

రేగొండ మండల కేంద్రంలో ఆదివారం రోజున అడక్ కమిటీ సభ్యులు కటకం రాజు, అంబాల రవీందర్, బండి సోమయ్య ఆద్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి రేగొండ మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలకు మొత్తం 33 మంది అక్రిడేశన్, పి.డీ.ఎఫ్, యూ ట్యూబ్, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ లకు గాను 21మంది జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ ఎన్నికలలో ఉమ్మడి రేగొండ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడుగా పట్టేం కోటిలింగం ని జర్నలిస్టు లు అందరూ ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ… జర్నలిస్ట్ ల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే తనపై నమ్మకంతో అధ్యక్ష పదవికి సహకరించిన జర్నలిస్ట్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

కమిటీ సభ్యులు:

గౌరవ అద్యక్షుడు:- కటకం రాజు

గౌరవ సలహాదారుడు:- బోట్ల ప్రవీణ్

ప్రధాన కార్యదర్శి:- పకిడే నవీన్

ఉపాధ్యక్షులు:- రోంటాల శంకర్, బండారి రాజు

కోశాధికారి:- బండి కమలాకర్

సహాయ కారదర్శలు:- మోటం రాజు, మంతెన మదు

సంయుక్త కార్యదర్శి:- బండారి తిరుపతి

ప్రచార కార్యదర్శి:- గునుకంటి రాకేష్

 

కార్యవర్గ సభ్యులు:

బొమ్మకంటి నవత్

మ్యాదరబోయిన రాజు

మార్తా రాజు

ఈ కార్యక్రమంలో ఎండీ.రహీం, మంతెన సురేష్, అక్కల రమేష్, అమ్మ పవన్ తదితరులు పాల్గొన్నారు.