prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:13 pm Digital Edition : MAHESH MEDCHAL

ఉత్తమ సేవలకు తహసీల్దార్ భూపాల్, సీనియర్ అసిస్టెంట్ నరేష్‌కు ఘన సన్మానం

*ఉత్తమ సేవలకు తహసీల్దార్ భూపాల్, సీనియర్ అసిస్టెంట్ నరేష్‌కు ఘన సన్మానం*

మేడ్చల్ ఆగష్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు అందుకున్న మేడ్చల్ తహసీల్దార్ భూపాల్, ఉత్తమ సీనియర్ అసిస్టెంట్‌గా అవార్డు పొందిన నరేష్‌లను బీజేపీ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందిస్తున్న సేవలు, విధుల పట్ల చూపుతున్న అంకితభావం, సమర్థవంతమైన పనితీరును అభినందించారు. ప్రభుత్వ పరిపాలనలో అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవలకు అవార్డులు అందుకోవడం మేడ్చల్ ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ భూపాల్, నరేష్‌లకు అభినందనలు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.