prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 8:26 am Digital Edition : SURENDHAR MAHEBUBABAD

ఉత్తమ తహశీల్దార్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

ఉత్తమ తహశీల్దార్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

మండలంలోని ఆగస్టు 15న
ఉత్తమ తహశీల్దార్ అవార్డు ను, 80వస్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ చేతుల మీదుగా ఉత్తమ తహశీల్దార్ గా గడీల శ్రీనివాస్ కు అవార్డు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది సోమవారం ఘనంగా సన్మానించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ, తనకు ఈ అవార్డు రావడంలో ఇబ్బంది సహాయ సహకారాలు ఉన్నాయని, ఈ అవార్డు అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, నా యొక్క బాధ్యతలను మరింత పెంచిందని, ఆయన తెలిపారు. అదేవిధంగా నాపై కార్యాలయం సిబ్బందికి ఉన్న ఆధారఅభిమానాలు, ఎప్పటికీ ఉండాలని, ఆయన ఆకాంక్షించారు. తనను సత్కరించిన కార్యాలయ అధికారులకు, వివిధ శాఖల సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నరసయ్య, ఆర్ ఐ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.