ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సభ్యులపై రాజకీయ పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అప్రజాస్వామికం: ఇ.ఎల్.వి. భాస్కర్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: సామాజిక బాధ్యతతో ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సభ్యులపై రాజకీయ పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇ.ఎల్.వి. భాస్కర్ తీవ్రంగా ఖండించారు. అన్ని రాజకీయ పార్టీలను,ప్రజా సంఘాలను కలుపుకొని కేవలం ప్రజల సంక్షేమం, సేవే లక్ష్యంగా ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, పేదలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా...