prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 5:10 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సభ్యులపై రాజకీయ పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అప్రజాస్వామికం: ఇ.ఎల్.వి. భాస్కర్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

సామాజిక బాధ్యతతో ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సభ్యులపై రాజకీయ పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇ.ఎల్.వి. భాస్కర్ తీవ్రంగా ఖండించారు. అన్ని రాజకీయ పార్టీలను,ప్రజా సంఘాలను కలుపుకొని కేవలం ప్రజల సంక్షేమం, సేవే లక్ష్యంగా ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, పేదలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న సభ్యులపై రాజకీయ కారణాలతో చర్యలు తీసుకోవడం అత్యంత విచారకరమని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. సేవా దృక్పథాన్ని ప్రోత్సహించాల్సిన సమయంలో, సేవ చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే వ్యక్తుల సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని. ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి సొంతం కాదని, ఏ పార్టీకి వ్యతిరేకం కూడా కాదని అన్నారు. ప్రజా సేవే ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని సూచించింది. రాజకీయ వేధింపులు, పార్టీ నిర్ణయాలు లేదా ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా సమాజ శ్రేయస్సు కోసం ఫౌండేషన్ బాటలో నడిచే సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఇ.ఎల్.వి. భాస్కర్ తెలిపారు. “యువతను అణచివేయాలని చూస్తే ఎంతటి వారైనా సహించేది లేదు. యువతలో సేవా స్ఫూర్తిని అడ్డుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. రానున్న రోజుల్లో యువతే ప్రజాస్వామ్య పద్ధతికి సరైన సమాధానం చెబుతుంది” అని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా తమ సేవా ప్రయాణాన్ని మరింత విస్తృతంగా, నిరంతరంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఇ.ఎల్.వి. భాస్కర్ తెలిపారు.