ఇసుక సరఫరా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జైపూర్,ఆగస్టు 20, ప్రజావాణి: ఎస్.ఎస్.ఎం.ఎం.ఎస్. వెబ్ సైట్ ద్వారా చేపడుతున్న ఇసుక సరఫరా ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని జైపూర్ లో గల వేలాల ఇసుక రీచ్ ని తహసిల్దార్ వనజ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుకను పారదర్శకంగా, అధికారికంగా అందించేందుకు ఎస్.ఎస్.ఎం.ఎం.ఎస్. వెబ్ సైట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు నిర్ణీత...