prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 10:31 pm Digital Edition : NAZEER CHENNOOR

ఇసుక సరఫరా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,ఆగస్టు 20, ప్రజావాణి:

ఎస్.ఎస్.ఎం.ఎం.ఎస్. వెబ్ సైట్ ద్వారా చేపడుతున్న ఇసుక సరఫరా ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని జైపూర్ లో గల వేలాల ఇసుక రీచ్ ని తహసిల్దార్ వనజ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుకను పారదర్శకంగా, అధికారికంగా అందించేందుకు ఎస్.ఎస్.ఎం.ఎం.ఎస్. వెబ్ సైట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు నిర్ణీత గడువులోగా సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షించాలని, ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జాతీయ రహదారి 163 జి నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు పనులను పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.