ఇసుక లారీ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి
*ములుగు జిల్లా ప్రతినిధి శ్రీకాంత్(ప్రజావాణి)* ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పస్రా–తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై ఇసుక లారీ కారును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వేగంగా వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో వరంగల్ హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన కలకోట సురేఖ మృతి చెందారు. ఆమె వయసు 45 సంవత్సరాలు. సురేఖ మహబూబాబాద్...