ఇథనాల్ వ్యర్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు- సాగునీటి కాలువలోకి వ్యర్థాల విడుదలపై అఖిలపక్షం ఆగ్రహం

బెజ్జంకి, ఆగస్టు 30 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామ శివారులో ఉన్న సాగునీటి కాలువను అఖిలపక్ష నాయకులు ఆదివారం పరిశీలించారు. బెజ్జంకి మండలం గుగ్గిళ్ల శివారులో నిర్మించిన ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను సాగునీటి కాలువలోకి విడుదల చేస్తున్నారని వారు ఆరోపించారు. గుగ్గిళ్ల నుంచి బెజ్జంకి ఎక్స్‌రోడ్, గాగిల్లాపూర్, దాచారం మీదుగా తోటపల్లి చెరువులోకి వెళ్లే ఈ సాగునీటి కాలువలోకి వ్యర్థాలు విడుదల చేయడంతో చేపలు, పశువులు మృతి చెందడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయని నాయకులు...