ఇటుకలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దాతృత్వం చాటుకున్న మాజీ సర్పంచ్ బూసి వెంకటశేషయ్య కాశినాయన ఆగస్టు 16 (ప్రజావాణి)మండలం ఇటుకలపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి.సుధాకర్ బాబు,పీఎస్‌హెచ్‌ఎం శ్రీ పి. కేశయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు,ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థులు దేశభక్తిని ప్రతిబింబించే విధంగా క్రమశిక్షణతో ర్యాలీగా వచ్చి జాతీయ జెండాకు వందనం చేశారు.ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ బూసి వెంకటశేషయ్య దాతృత్వం ప్రత్యేక...