prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 9:05 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఇఎల్వి భాస్కర్ కి రాఖీ కట్టిన అక్క చెల్లెలు

రైతులకు రెండేళ్లలో నాగార్జునసాగర్ నీళ్లు తెస్తానని హామీ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ మునుగోడు నియోజకవర్గం అక్కాచెల్లెళ్లతో కలిసి ఎంతో ఆత్మీయంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ కి రాఖీ కట్టి తమ అన్నగా ఆశీర్వదించారు. ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ కూడా వారి కష్టసుఖాలను తెలుసుకుని, వారితో కలిసి విందు భోజనం చేశారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా, ఒక కుటుంబసభ్యుడిలా కలిసిపోవడం అందరినీ ఆకట్టుకుంది.
*రైతులకు భరోసా – సాగర్ నీళ్ల హామీ:*
ఈ వేడుక అనంతరం ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ రైతులకు భరోసా ఇచ్చారు. “రాఖీ కట్టిన ప్రతి అక్కాచెల్లెలి కుటుంబం రైతు కుటుంబమే. వారి కష్టం నాకు తెలుసు. నీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో మునుగోడు నియోజకవర్గం రైతులకు నాగార్జునసాగర్ వాటర్ అందే విధంగా నేను కృషి చేస్తాను. దీనికోసం రైతులందరూ నాతో కలిసి రావాలి, మనమంతా కలిసి సాధించుకుందాం” అని చెప్పారు. ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ మాటలతో అక్కడ ఉన్న రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలతో మమేకమై, రైతు సమస్యలపై పోరాడుతున్న ఐఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ కి అక్కాచెల్లెళ్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి నాయకుడు మనకు అవసరమని స్థానికులు అంటున్నారు.