prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 9:08 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు పెద్దపీట: వినోద్ కుమార్…..లాటరీ ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక

పోచారం, ఆగస్టు 30: పోచారం ప్రాంతంలోని ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ పద్ధతిలో డ్రా కార్యక్రమాన్ని ఆదివారం పోచారం సద్భావనలో నిర్వహించారు. ఘట్‌కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన పేదలకు పారదర్శకంగా, న్యాయబద్ధంగా అందించాలనే ఉద్దేశంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇంద్రమ్మ ఇళ్ల పథకం పేదల సంక్షేమానికి నిదర్శనమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.