ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల తీరుతుంది — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి: చండూర్ మున్సిపాలిటీ లోని 8 వ వార్డుకు చెందిన గండూరి సత్యనారాయణ నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమము చండూర్ మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పేదల సొంత ఇంటికాలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎన్నో కుటుంబాలకు సంతోషాన్ని అందిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం పేదలకు...