prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 5:42 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల తీరుతుంది — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

చండూర్ మున్సిపాలిటీ లోని 8 వ వార్డుకు చెందిన గండూరి సత్యనారాయణ నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమము చండూర్ మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పేదల సొంత ఇంటికాలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎన్నో కుటుంబాలకు సంతోషాన్ని అందిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం పేదలకు ఒక వరం లాంటిదని తెలిపారు. ఈ సందర్భంగా గండూరి సత్యనారాయణ దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమముకు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు బుషిపాక వాసు, జెల్ల ధనమ్మశ్రీనివాస్, కటకం రమేష్, వార్డు ఆఫీసర్స్ ఏ. జగన్, బి. సాయిరాం మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్, బిల్ కలెక్టర్లు జి. మహేష్, జి. రమేష్ పాల్గొనడం జరిగింది.