prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 11:11 am Digital Edition : PRAJA VANI

ఆర్యవైశ్య మహాసభలో పాల్గొని, జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..<br>

ఆర్యవైశ్య మహాసభలో పాల్గొని, జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..

కోదాడ, ఆగస్టు 15/ ప్రజావాణి పట్టణంలోని 31వ వార్డులో నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా నూతన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక బాధ్యతగా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కార్యాలయం ద్వారా సంఘం బలోపేతం కావాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా, నియోజకవర్గ, పట్టణ కమిటీల ప్రతినిధులు, స్థానిక నాయకులు, వార్డు కౌన్సిలర్, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య ప్రముఖులు మరియు మహిళలు పాల్గొన్నారు.