prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 9:41 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఆర్టీఐ పరిధిలోకి చండూర్ మద్యం దుకాణాలు: వివరాలు వెల్లడించాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏ4 మద్యం వినియోగ దరఖాస్తు (షాపులు) సమగ్ర వివరాలను వెల్లడించాలని ఆర్టీఐ కార్యకర్త కిరణ్‌కుమార్ సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ)–2005 కింద స్వీకరించారు. 2026 ఆగస్టు 17న ఈ దరఖాస్తును నల్గొండ జిల్లా ప్రొహిబిషన్ పబ్లిక్ అండ్ ఎక్సైజ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు బదిలీ చేస్తూ, కోరిన నేరుగా దరఖాస్తుదారుడికి అందించాలని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం అందించింది.

కోరిన ప్రధాన వివరాలు:

లైసెన్సులు & అనుమతులు: 2021 జనవరి 1 నుండి ఇప్పటివరకు వైన్ షాపుల లైసెన్స్ నంబర్లు, లైసెన్స్‌దారుల పేర్లు, కాలపరిమితి మరియు శాఖ జారీ చేసిన అనుమతి పత్రాలు.

కేసులు & పెనాల్టీలు:

నిబంధనల ఉల్లంఘనలు, నమోదైన కేసులు, విధించిన జరిమానాలు మరియు లైసెన్స్‌లపై తీసుకున్న చర్యల రికార్డులు.

తనిఖీలు & ఫిర్యాదులు:

ఆకస్మిక తనిఖీల నివేదికలు, మద్యం పరిశీలన మరియు అక్రమ విక్రయాలపై వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు.
ఈ పీడీఎఫ్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో అందించాలని దరఖాస్తుదారు కోరగా, ఆర్టీఐ సెక్షన్ 6(3) ప్రకారం చర్యలు వేగవంతం చేసి అందజేయాలని సంబంధిత అధికారులను డిప్యూటీ కమిషనర్ నియమించారు.