prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 1:38 pm Digital Edition : RAKESH PEDDAPALLY

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

ఆటో సంక్షేమ బోర్డు, రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్.

ఈనెల 24 నుంచి నిరవధిక ఆటో బంద్‌కు మద్దతు కోరిన నాయకులు.

గోదావరిఖని, ఆగస్టు 15 ప్రజావాణి :

గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తా–2 ఆటో అడ్డా యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఆటో జేఏసీ పెద్దపల్లి జిల్లా గౌరవాధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి, ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవి కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆటో డ్రైవర్ల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పులు రాలేదన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు రూ.12 వేల ఆర్థిక సాయంను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి చేపట్టనున్న ఆటో డ్రైవర్ల నిరవధిక బంద్ను విజయవంతం చేయాలని ఆటో కార్మికులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు జావిద్ భాష, ఆటో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కే జబ్బర్, వీఎచ్‌ఆర్ ఫౌండేషన్ ఆటో సేవా సమితి నాయకులు శ్రీధర్, రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి మడిపెద్ద రమేష్, కార్పొరేషన్ అధ్యక్షులు ఎండి బురహన్, జిల్లా నాయకులు కాసిపేట రాజయ్య, మాటేటి రాజేశం, గోవిందు, నిజాం తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.