prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 4:47 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఆందోళనకు ఏపీజూడ శ్రీకారం — ఆగస్టు 17 నుంచి అత్యవసర వైద్య సేవల నిలిపివేత*

తిరుపతి ఆగస్టు 17 ప్రజావాణి రూయ హాస్పిటల్ నియర్ వైద్యుల టైం పెండ్ సవరణను వెంటనే అమలు చేయాలని కోరుతూ *ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ -ఏపీజూడ* దశలవారీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది.2026 ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోగా ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన లిఖితపూర్వక హామీ లేదా నిర్ణయం వస్తుందని ఆశించాం. అయితే నిర్దేశిత గడువులోపు ఎటువంటి స్పందన రాకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో *ఫేజ్-III ఆందోళనను 2026 ఆగస్టు 17 నుంచి ప్రారంభిస్తున్నాం.*

ఫేజ్–III లో తీసుకున్న నిర్ణయాలు:*

1. అన్ని అత్యవసరం కాని వైద్య సేవల నిలిపివేత కొనసాగుతుంది.

2. ఆందోళనలో భాగంగా ఉన్న వైద్యులు అత్యవసర వైద్య సేవలను కూడా ఉపసంహరించుకుంటారు.

3. ఇంటర్న్స్, జూనియర్ రెసిడెంట్స్,సూపర్ స్పెషాలిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డి పీ ఆర్  మరియు సెంట్రల్/పెరిఫెరల్ పోస్టింగ్ లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సీనియర్ రెసిడెంట్స్ తదితరులు ఆందోళనలో భాగస్వాములు అవుతారు.4. తదుపరి నిర్ణయాలు మరియు కార్యాచరణను  అధికారికంగా తెలియజేస్తుంది.రోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు ప్రతి దశలోనూ అత్యవసర మరియు ఐసీయూ సేవలను కొనసాగిస్తూ ప్రభుత్వం స్పందించేందుకు అవకాశం ఇచ్చాం. టైం పెండ్ సవరణపై గత అనేక నెలలుగా పలుమార్లు అధికారులకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తులు, ప్రతినిధులతో చర్చలు జరిపినా ఇప్పటివరకు స్పష్టమైన, లిఖితపూర్వక మరియు కాలపరిమితితో కూడిన నిర్ణయం రాలేదు. *ఏపీజూడ డిమాండ్*జూనియర్ వైద్యుల టైం పెండ్ సవరణపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన, లిఖితపూర్వక మరియు కాలపరిమితితో కూడిన హామీ/నిర్ణయం ఇవ్వాలి.ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వస్తే, రోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీజూడ కూడా నిర్మాణాత్మక చర్చలకు సిద్ధంగా ఉంది.ఈ ఆందోళన కారణంగా ప్రజలకు మరియు రోగులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తోంది. అయితే సమస్య మరింత తీవ్రతరం కాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అని ఏపీజూడ  స్పష్టం చేస్తోంది.కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి, టైం పెండ్ సవరణపై సంతృప్తికరమైన లిఖితపూర్వక నిర్ణయం తీసుకొని, వైద్య సేవలు సాధారణ స్థితికి తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఏపీజుడా విజ్ఞప్తి చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ -ఏపీజుడా