అవుషాపూర్‌లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి…వారం రోజుల్లో పరిష్కరించకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా: నాయకులు, గ్రామస్థుల హెచ్చరిక
ఘట్కేసర్, ఆగస్టు 25: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఉప్పల్ జోన్, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని 7వ డివిజన్ ఎదులాబాద్‌లోని అవుషాపూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు, యువకులు ఘట్కేసర్ విద్యుత్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా గ్రామంలో తరచూ విద్యుత్ కోతలు, తక్కువ వోల్టేజీ, సరఫరాలో అంతరాయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్కువ వోల్టేజీ కారణంగా...