అవయవదానంపై చైతన్యం కల్పించాలి.. సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి

అన్నోజిగూడ, ఆగస్టు 13(ప్రజా వాణి): అవయవదానం, నేత్రదానం, శరీరదానం, రక్తదానంపై ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని టీం రేవంత్ యువసేన రాష్ట్ర సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రిటైర్డ్‌ పారామెడికల్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మనిషి మరణించిన తర్వాత కూడా తన అవయవాలతో ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందన్నారు. అవయవదానం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందికి పునర్జన్మ కల్పించవచ్చని, నేత్రదానం...