అర్పణపల్లిలో ఆధ్యాత్మిక సందడి.. ముత్యాలమ్మ తల్లి బోనాల జాతర !<br>
ఊరి దేవతకు బోనం.. గ్రామ ఐకమత్యానికి ప్రతీకగా ఆషాఢ ఉత్సవాలు.పసుపు–కుంకుమల పరిమళం.. వేపాకుల అలంకరణ.. మహిళల బోనాల ఊరేగింపుతో పండుగ.కేసముద్రం, ఆగస్టు 9 (ప్రజావాణి):ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణ పల్లెల్లో పండుగ సందడి మొదలవుతుంది. ఊరి దేవతకు మొక్కులు చెల్లించి.. తమ ఇళ్లకు, పంట పొలాలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకునే భక్తి భావం ప్రతి పల్లెలోనూ కనిపిస్తుంది. అదే ఆధ్యాత్మికతకు, తెలంగాణ పల్లె సంస్కృతికి అద్దం పడుతూ అర్పణపల్లి గ్రామం ముత్యాలమ్మ తల్లి బోనాల జాతరకు ముస్తాబైంది.ఊరిలో కొలువై ఉండి తమను కంటికి...