అమ్మలా ఆదరణ..అక్కలా అండ

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) సహజత్వానికి మరో పేరు — సీతక్క పదవిలో ఉన్నా... ప్రజల్లోనే నడిచే మనసు, అధికారంలో ఉన్నా... ఆప్యాయతే తనకు అలంకారం. హోదాలు ఎన్నొచ్చినా... హృదయం మాత్రం సామాన్యమే, సహజత్వానికి మారుపేరు — మన సీతక్కే! అడవిబాటలో అడుగేస్తే... ఆదివాసీ గుండెల్లో వెలుగు, ఆపదలో ఉన్నవారిని చూస్తే... అక్కలా అందించే అండ. కన్నీటి చుక్క కనిపిస్తే... కరిగిపోయే కరుణ, కష్టం చెప్పిన ప్రతి మనిషికీ... నేనున్నాననే ధైర్యం. చేతిలో అధికారం ఉన్నా... చేతిలో అహంకారం లేదు, చుట్టూ జన సందోహం...