అభివృద్ధి బాటలో శ్రీ సత్యసాయి జిల్లా
మహిళల ప్రగతికి ‘స్త్రీ శక్తి’ ప్రోత్సాహం
సమృద్ధిగా నీరు – పచ్చని పొలాలు
పెట్టుబడుల కేంద్రీకరణ – భారీగా ఉపాధి
నేతన్నకు అండగా ప్రభుత్వం
స్వాతంత్ర్య దినోత్సవ ప్రదర్శనలో ఉత్తమ శకటాల విజేతలు
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సత్యసాయి జిల్లా ప్రగతి నివేదికను సమర్పించిన రాష్ట్ర మంత్రి ఎస్. సవిత
అనంత పురం బ్యూరో ఆగస్టు 15: మన ప్రజా వాణి
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆర్మ్‌డ్ రిజర్వు, సివిల్ పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ సాధన దిశగా జిల్లాలో ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం అందిస్తున్న సేవలను కొనియాడారు.స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం… జిల్లాలోని 196 పల్లెవెలుగు, 14 ఆల్ట్రా పల్లెవెలుగు, 105 ఎక్స్‌ప్రెస్ (మొత్తం 315) బస్సుల ద్వారా ఇప్పటివరకు 2.41 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.
దివ్యాంగుల శక్త్తి పథకం…2.91 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించారు.
తల్లికి వందనం… జిల్లాలోని 2,27,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 341.59 కోట్లు జమ చేశారు.దీపం 2.0… 3,62,251 మంది లబ్ధిదారులకు రూ. 138.76 కోట్ల విలువై ఉచిత గ్యాస్ సిలిండర్ల సాయం అందించగా, పి ఎం ఉజ్వల యోజన కింద 38,036 మందికి ఉచిత ఎల్ పి జి కనెక్షన్లు ఇచ్చారు.
అన్నదాత సుఖీభవ (పిఎం కిసాన్)… 2,65,040 రైతు కుటుంబాలకు రూ. 179.35 కోట్ల పెట్టుబడి సాయాన్ని విడుదల చేశారు.మనమిత్ర వాట్సాప్
ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా 700కు పైగా పౌర సేవలను అందుబాటులోకి తెచ్చారు.జిల్లాలో 8 అన్న క్యాంటీన్ల ద్వారా రూ. 5లకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారు.వ్యవసాయ, ఉద్యాన & నీటిపారుదల రంగాలు… జలధార – జలహారతి: 1,659 జలసంరక్షణ పనులు పూర్తి చేసి, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో 4.75 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచారు. 1,020.50 కిలోమీటర్ల మేర వంకలు, కాలువల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి.హంద్రీనీవా సుజల స్రవంతి… జిల్లేడుబండ జలాశయం పనులు 50% పూర్తికాగా, పుట్టపర్తి నియోజకవర్గంలోని 195 మైనర్ ఇరిగేషన్ చెరువులను కృష్ణా నీటితో నింపే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.ఆధునిక వ్యవసాయం… 80% సబ్సిడీపై (రూ. 188.16 లక్షల వ్యయంతో) 24 గ్రూపులకు డ్రోన్లను సరఫరా చేయగా, 12,545 ఎకరాల్లో పిచికారీ చేశారు.
ఉద్యాన పంటలు…జిల్లాను ‘ఫ్రూట్ అండ్ వెజిటబుల్ బాస్కెట్’గా తీర్చిదిద్దే లక్ష్యంతో 71,222 హెక్టార్లలో ఉద్యాన పంటల ద్వారా 13.73 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించారు.పరిశ్రమల స్థాపన…రూ. 2,140.81 కోట్ల పెట్టుబడితో 14,318 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా 79,249 మందికి ఉపాధి కల్పించారు. అంతేకాకుండా రూ. 18,240 కోట్ల భారీ పెట్టుబడులతో రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టుల ద్వారా మరో 9,235 మందికి కొత్తగా ఉపాధి లభించనుంది.గృహ నిర్మాణం… రూ. 673 కోట్ల వ్యయంతో 28,037 గృహాల నిర్మాణం పూర్తయింది.తాగునీరు (జలజీవన్ మిషన్)…
1,524 పనులకు గాను 1,100 పనులు పూర్తి చేసి, ఇప్పటివరకు 3,09,272 కుళాయి కనెక్షన్లు ఇచ్చారు.
చేనేత, బిసి సంక్షేమం & పింఛన్లు…
NTR భరోసా పింఛన్లు: 2,58,822 మంది పింఛనుదారులకు రూ. 458.95 కోట్లు పంపిణీ చేశారు. చేనేత కార్మికులకు సాయం: 50 ఏళ్లు దాటిన 12,712 మంది చేనేత కార్మికులకు రూ. 4,000 చొప్పున పింఛను ఇస్తున్నారు. నేతన్నల సేవలో భాగంగా 12,000 చేనేత కుటుంబాలకు రూ. 25,000 ఆర్థిక సాయం అందించారు. ధర్మవరం మెగా చేనేత క్లస్టర్: రూ. 35 కోట్ల నివేదన పంపగా, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్ కింద జాతీయ గుర్తింపు తెచ్చారు.ఈ వేడుకల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితతో పాటు జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
