అభివృద్ధికి ఆమడ దూరంలో లక్నవరం చెరువు
.ప్రధాన కాలువలు ఎండిపోతున్న పంట పొలాలు. ములుగు జిల్లా ప్రతినిధి శ్రీకాంత్(ప్రజావాణి) గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు ఆయకట్టు పరిధిలో రైతుల కష్టాలు తీవ్రమయ్యాయి. వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఎకరాకు ఇప్పటికే 15 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు పంట నష్టపోతామనే భయంతో మనోధైర్యం కోల్పోతున్నారు. "నాట్లు వేసిన పంట కళ్ళముందే ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతోంది" అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క లక్నవరం - రాంపూర్ కోట...