prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 9:23 am Digital Edition : PRAJA VANI

అభిమానులకు అండగా.. ఆప్యాయతకు ప్రతిరూపంగా ఎంపీ వంశీకృష్ణ<br>

-ఆరోగ్య పరిస్థితులపై ఆరా.. కుటుంబ సభ్యులకు ధైర్యం.

గోదావరిఖని, మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 15

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గోదావరిఖనిలో పర్యటించి కాకా కుటుంబ అభిమానులు గుమ్మడి కుమారస్వామిని,ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఐఎన్టియుసి జనరల్ సెక్రటరీ రాచకొండ కోటేశ్వర్లను పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని,కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.కాకా కుటుంబ అభిమానులు, కార్యకర్తలతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ వారి కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న ఎంపీ వంశీకృష్ణ, అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించడం ద్వారా తన ఆప్యాయతను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానుల యోగక్షేమాలను స్వయంగా తెలుసుకుంటూ వారికి భరోసా కల్పించడం పట్ల కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.