అన్నోజిగూడ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు… పాఠశాలకు రూ.70 వేల విలువైన సౌండ్ సిస్టమ్ విరాళం అందించిన రేవంత్ అన్న టీం సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి
ఘట్‌కేసర్, ఆగస్టు 15 (ప్రజా వాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రేవంత్ అన్న టీం సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వెంటనే స్పందించారు. తన సొంత నిధులతో...