అన్నోజిగూడ చౌరస్తాకు సంత్ సేవాలాల్ మహారాజ్ చౌరస్తాగా నామకరణం

ఘట్‌కేసర్, ఆగస్టు 14 (ప్రజా వాణి): అన్నోజిగూడ చౌరస్తాను సంత్ సేవాలాల్ మహారాజ్ చౌరస్తాగా నామకరణం చేస్తూ నిర్వహించిన కార్యక్రమం ఘనంగా విజయవంతమైంది. కార్యక్రమానికి హాజరై తమ వంతు సహకారం అందించిన బంజారా సోదరులు, సోదరీమణులకు నిర్వాహక కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. బంజారా సమాజం ఐకమత్యం, సహకారం, అంకితభావంతోనే నామకరణ కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నానావత్ రామ్...