అన్నోజిగూడలో వైభవంగా బోనాల పండుగ…రేవంతన్న టీం సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు….అమ్మవార్లను దర్శించుకున్న ఐటీ కారిడార్ సీఐ జగన్నాథ్
ఘట్‌కేసర్, ఆగస్టు 16 (ప్రజా వాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో ఎర్రపోచమ్మ, నల్లపోచమ్మ దేవాలయాల బోనాల ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రేవంతన్న టీం సభ్యులు, యువనేత సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పోచారం ఐటీ కారిడార్ సీఐ జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సీఐ జగన్నాథ్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు...