prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 5:35 pm Digital Edition : MAHESH MEDCHAL

అత్వెల్లి ఉన్నత పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ ఉత్సవాలు

అత్వెల్లి ఉన్నత పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది,ఈ సందర్భంగా ముందుగా విద్యార్థిని, విద్యార్థులు రాఖీల తయారి యొక్క పోటీలను నిర్వహించుకున్న తర్వాత 50 రాఖీలను విద్యార్థులు తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత రక్షాబంధన్ ఉత్సవంలో భాగంగా, విద్యార్థిని, విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని నీవు నాకు రక్ష నేను నీకు రక్షా మనిద్దరం పాఠశాలకు, దేశానికి రక్షా అని ఒకరికొకరు రక్షాబంధన్ శుభాకాంక్షలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాణిక్యాల రావుతో పాటు ఉపాధ్యాయులు గడప నవీన్, వసీం, రంగారావు, రాంబాబు, మంజుల, స్వరూప రాణి, విజయలక్ష్మి, సోనీ తదితరులు పాల్గొన్నారు.