అడిగాస్ కూడలి వద్ద ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి<br>మేడ్చల్–అత్వెల్లి జాతీయ రహదారి పనులపై ఎంపీ రఘునందన్‌రావు ప్రత్యేక దృష్టి
రామాయంపేట: రామాయంపేట పట్టణంలోని అడిగాస్ రెస్టారెంట్ కూడలి వద్ద ప్రతిపాదిత కొత్త ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రీజనల్ ఆఫీసర్ శివశంకర్‌ను ఎంపీ కలిసి, నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి అభివృద్ధి పనులపై చర్చించారు.రామాయంపేటలోని అడిగాస్ రెస్టారెంట్ కూడలి వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు దాటే సమయంలో ప్రజలకు ఇబ్బందులు...