అక్రమంగా నిల్వ ఉంచిన 150 బియ్యం సంచులు స్వాధీనం

ప్రజావాణి,నంగునూరు ఆగస్టు 31: నమ్మదగిన సమాచారం మేరకు రాజగోపాల్‌పేట పోలీసులు, సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం సంచులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో నంగునూరు మండలం రాంచంద్రాపూర్ మధిర గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన మోతె సాయి తరుణ్ (24) ఇంటి ఆవరణలోని రేకుల షెడ్‌లో, అలాగే ఇంటి ముందు అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 150 సంచుల బియ్యాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం...