అంగన్‌వాడీపై డీఎంహెచ్‌ఓ నజర్‌ చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

*అంగన్‌వాడీపై డీఎంహెచ్‌ఓ నజర్‌.. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ* *మచ్చబొల్లారం అంగన్‌వాడీ కేంద్రంలో డా. కె. ఆనంద్ ఆకస్మిక తనిఖీ* మేడ్చల్ ఆగస్టు 18 (పీపుల్స్ డైరీ):- చిన్నారులకు అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్ స్పష్టం చేశారు. మచ్చబొల్లారం అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన.. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే సేవల నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా డీఎంహెచ్‌ఓ స్వయంగా...