- 12వ వార్డులో చీకట్లు.. లైట్లు లేక అవస్తలు
పట్టించుకోని గ్రామ పంచాయతీ
అభ్యుదయ కాలనీ వాసుల ఆవేదన
*పస్రా (ప్రజావాణి)*
పస్రా గ్రామ పంచాయతీ పరిధిలోని అభ్యుదయ కాలనీ 12వ వార్డు నివాసితులు వీధి లైట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాలనీలో గత కొంతకాలంగా వీధి లైట్లు పనిచేయడం లేదని, దీనిపై పలుమార్లు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి సమయంలో చీకట్లు అలుముకోవడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నామని వాపోతున్నారు.
దోమలు, పాములు, దొంగల భయంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్లు కూడా అధ్వానంగా ఉండటంతో చిన్నపాటి వర్షానికే బురద అవుతుందని తెలిపారు.
పన్నులు సక్రమంగా కడుతున్నా కనీస మౌలిక వసతులు కల్పించడం లేదు అని కాలనీవాసులు మండిపడ్డారు.
పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి 12వ వార్డులో వీధి లైట్లు బాగు చేయించి, వీధుల్లో లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సమస్యను తక్షణం పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని అభ్యుదయ కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.
*బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మీ*