వెంకటాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల సమావేశం

కడప జిల్లా పోరుమామిళ్ల జులై 24 ప్రజావాణి మండల పరిధిలోని వెంకటాపురం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీస్) నందు విద్యార్థుల తల్లిదండ్రుల మహాసభ (పేరెంట్స్ మీటింగ్) అత్యంత ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ( హెడ్మాస్టర్ ) త్రివీధి జయరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్రివీధి జయరాములు మాట్లాడుతూ.విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది ప్రాథమిక విద్యేనని స్పష్టం చేశారు.పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలను,ప్రభుత్వ పథకాలను...