prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 2:27 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వెంకటాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల సమావేశం

కడప జిల్లా పోరుమామిళ్ల జులై 24 ప్రజావాణి మండల పరిధిలోని వెంకటాపురం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీస్) నందు విద్యార్థుల తల్లిదండ్రుల మహాసభ (పేరెంట్స్ మీటింగ్) అత్యంత ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ( హెడ్మాస్టర్ ) త్రివీధి జయరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్రివీధి జయరాములు మాట్లాడుతూ.విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది ప్రాథమిక విద్యేనని స్పష్టం చేశారు.పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలను,ప్రభుత్వ పథకాలను తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల చదువులో కేవలం పాఠశాల పాత్రే కాకుండా ఇంటి వద్ద తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యమని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులు శ్రీమతి శ్రీరేఖ, జయలక్ష్మి,శరత్, మరియు రాజేంద్రప్రసాద్,మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ,హాజరు శాతం,మరియు చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం గురించి చర్చించారు.ప్రతి నెలా ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు మధ్య మంచి సమన్వయం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.తమ పిల్లల విద్యా ప్రగతిని అడిగి తెలుసుకున్న తల్లిదండ్రులు, పాఠశాలలో మౌలిక వసతులు మరియు ఉపాధ్యాయుల బోధనా తీరు పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యాబోధన అందిస్తున్న పాఠశాల సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామ ప్రముఖులు,పాఠశాల విద్యా కమిటీ సభ్యులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.