ఘట్‌కేసర్, జూలై 20: నూతనంగా నిర్మించిన ఉపకేంద్రానికి అనుసంధానంగా 33 కేవీ విద్యుత్ లైన్ స్ట్రింగింగ్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో నారపల్లి ఉపకేంద్రం పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
33/11 కేవీ నారపల్లి ఉపకేంద్రం నుంచి వెలువడే 11 కేవీ నారపల్లి ఫీడర్‌పై ప్రజల భద్రత, ప్రమాదాల నివారణ దృష్ట్యా లైన్ క్లియరెన్స్ పనులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయ ప్రాంతాలు.. వెంకటాద్రి టౌన్‌షిప్, చౌదరిగూడ, విజయపురి కాలనీ, శివాజీ నగర్, ఓయూ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడనుంది. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
విద్యుత్ వినియోగదారులు శాఖకు సహకరించాలని నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ హరినాథ్ సగ్గు కోరారు.