prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 10:58 am Digital Edition : PRAJA VANI

వర్షాకాలంలో ఇసుక రవాణా వద్దు – గ్రామస్తుల నిరసన

వర్షాకాలంలో ఇసుక రవాణా వద్దు – గ్రామస్తుల నిరసన

కోటగిరి/ప్రజావాణి:-మా గ్రామం మీదుగా వర్షాకాలంలో ఇసుక ట్రాక్టర్ల రాకపోకలను గ్రామస్తులు అడ్డుకున్నారు.వర్షాలకు గ్రామంలోని ప్రధాన రోడ్లు బురదమయమై విద్యార్థులు, ప్రజలు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా భారీ ట్రాక్టర్ల రాకతో ప్రధాన కల్వర్టులు కూడా దెబ్బతింటున్నాయి.గతంలో కూడా రాత్రి పగలు తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా గ్రామం మీదుగా ఎలాంటి ఇసుక రవాణా జరగకూడదని నిర్ణయించారు.అనుమతి లేని ఇసుక ట్రాక్టర్లను గుర్తించి అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.ఇసుక రవాణాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.