prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 8:56 am Digital Edition : PRAJA VANI

వర్షపు నీటి నిల్వ సమస్యలపై మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆకస్మిక పరిశీలన

వర్షపు నీటి నిల్వ సమస్యలపై మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆకస్మిక పరిశీలన
జమ్మికుంట, జూలై 29 (ప్రజావాణి): జమ్మికుంట మున్సిపల్ పరిధిలో వర్షాలు కురిసిన సమయంలో వరద నీరు నిల్వ ఉండి సమస్యలు ఏర్పడే ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పరిశీలించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, హుజురాబాద్ రోడ్డు నుంచి వచ్చే వర్షపు నీరు శ్రీరామ హాస్పిటల్ ప్రాంతంలో సక్రమంగా వెళ్లకుండా డ్రైనేజీల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు తదితర చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడినట్లు గుర్తించారు. వెంటనే మున్సిపల్ జేసీబీతో డ్రైనేజీల్లోని చెత్తను తొలగించి శుభ్రపరిచే పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి నరేష్ తదితరులు పాల్గొన్నారు.